నారద వర్తమాన సమాచారం
తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సీ ఎమ్.సాయి కాంత్ వర్మ
అంబేద్కర్ గొప్ప స్పూర్తి ప్రదాత
గుంటూరు, ఏప్రిల్ 14 : డా.బి.ఆర్ అంబేద్కర్ గొప్ప స్పూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ సి.ఎమ్ .సాయి కాంత్ వర్మ అన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, మహానేత, సామాజిక న్యాయానికి ప్రతీక డా. బి.ఆర్.అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే మహత్తర విలువలను సమాజంలో స్థాపించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు, అవకాశాలు కల్పించిందని చెప్పారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. విద్య, న్యాయం, సమాన హక్కులు అనే ఆయన సందేశం నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసుకోవడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందరం కలిసి ఆయన చూపిన మార్గంలో నడిచి సమానత్వభారతాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ అలీం భాషా, అదనపు కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








