
నారద వర్తమాన సమాచారం:బెల్లంకొండ:ప్రతినిధి
పాపాయపాలెం గ్రామనికి చెందిన 10 మంది వాలంటీర్స్ రాజీనామా*
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామం
జగన్మోహన్ రెడ్డికి తోడుగా నడిచేందుకు తమ వాలంటరీ పదవికి రాజీనామా చేసామని అన్నారు. బెల్లంకొండ ఎంపీడీవో కార్యాలయంలో పాపాయపాలెం గ్రామానికి చెందిన 10 మంది వాలంటరీలు గురువారం తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీఓ వెంకటరెడ్డికి మర్రి అనంతరెడ్డి, మర్రి రామచంద్రరెడ్డి, బత్తుల భూపతి రామారావు, బత్తుల సతీష్, తురక నచ్చారయ్య, మర్రి మాధవి, పాలడుగు ప్రమీల,తెల్లమేక్కల చంద్రయ్య, చెల్లి జ్యోతి, భగ్గి లక్ష్మి నారాయణ వాలంటరీల బాధ్యతలు నుండి తప్పుకుంటున్నట్లు రాజీనామా పత్రాలను ఎంపీడీఓకి అందజేశారు. ఈ సందర్భంగా వారు జగన్మోహన్ రెడ్డికి అండగా, తోడుగా నడిచేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అదేవిధంగా ప్రతి నెల ఒకటవ తారీకు అందజేసే పింఛన్లు పంపిణీలో వాలంటీర్లు భాగస్వామ్యం అవ్వ , తాతలకు నేరుగా ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్లు అందజేశామని తెలిపారు. అలాంటిది ఎన్నికల కమిషనర్ పెన్షన్ పంపిణీలో వాలంటీర్లును పాల్గొన్న వద్దని చెప్పడంతో ముఖముడిగా రాజీనామా చేయడం జరిగిందని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.