నారద వర్తమాన సమాచారం :
స్వేచ్ఛ, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరులు మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ .
మైలవరం తెదేపా ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు.
నారద వర్తమాన సమాచారం జి.కొండూరు ప్రతినిధి.
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం విశ్రమించకుండా సమర శంఖం పూరించిన ధీరులు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
భారతదేశ మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమర యోధులు, అణగారిన ప్రజల హక్కుల కోసం కృషిచేసిన మహోన్నత వ్యక్తి, అహింసామూర్తి, రాజ్యాంగ సభ సభ్యులు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతిని ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ , భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.
టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవిత కాలంలో పేదల కోసం ఎన్నో సేవలు అందించారన్నారు. పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయమన్నారు. ఇటువంటి మహనీయుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన అడుగుజాడల్లో అందరం నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.