నారద వర్తమాన సమాచారం :వినుకొండ :ప్రతినిధి
13న వినుకొండలో “బీసీ గర్జన”
బీసీల సత్తా చాటేందుకు తరలి రావాలి
బీసీ గర్జన పోస్టర్ విడుదల
ఈనెల 13వ తేదీన వినుకొండ పట్టణంలో బీసీ గర్జన జరుగుతుందని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అయిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు బీసీ గర్జన పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈనెల 13వ తేదీన సాయంత్రం 4 గంటలకు
పట్టణంలో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర బీసీ నాయకులు హాజరవుతారని వెల్లడించారు.
77 సంవత్సరాల దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు పెద్ద పీట వేసి, సామాజికన్యాయం
సాకారం చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారని తెలిపారు. 2019లో బీసీలకు
రాజ్యసభలో నాలుగు స్థానాలులోక్ సభలో ఆరు స్థానాలు, 21 మందికి ఎమ్మెల్యేలు ఇచ్చిన ఘనత సీఎం జగనన్న కే దక్కుతుందని తెలిపారు.21 మంది బీసీలకు
ఎమ్మెల్సీలుగానూ, రాష్ట్ర స్థాయిలో జడ్పీ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వంటి పదవుల్లో
బీసీలకు అవకాశం కల్పించటం, కార్పొరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్మన్ పదవులిచ్చి,
954 నామినేటెడ్ పదవులు, బీసీలను ఆదరించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డినని అన్నారు. అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో
48 మంది బీసీలకు ఎమ్మెల్యే సీట్లు, 11 మంది బీసీలకు ఎంపీ సీట్లు కేటాయించి బీసీలకు
అగ్ర తాంబూలం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని బీసీలంతా ఏకతాటిపై
నిలిచి వారి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. బీసీ గర్జనకు నియోజకవర్గంలోని ఐదు మండలాల బీసీ నాయకులు
కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, బీసీ నాయకులు తదితలరులు పాల్గొన్నారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.