నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
ముస్లింలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
క్రోసూరు లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు
ముస్లిం సోదరులు ఎప్పుడూ తన మనసుకు దగ్గరగా ఉన్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని క్రోసూరు మండలం క్రోసూరులో మస్లిం సోదరులతో కలిసి ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిబద్ధతతో జీవిస్తూ.. సత్యం మాట్లాడుతూ, పరనిందకు పాల్పడకుండా.. దైవచింతనతో గడపడమే అసలైన జీవితమన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిబద్ధతతో పాటిస్తారన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఎప్పుడు ఏ అవసరమొచ్చినా తాను అండగా ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో తన గెలుపు కోసం ముస్లిం సోదరులు ఇచ్చిన మద్దతు మరువలేనిదన్నారు. ఈసారి కూడా అదే మద్దతు కోరుతున్నానన్నారు. సీఎం జగన్ కి, తనకు ముస్లిం సోదరులు అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.