నారద వర్తమాన సమాచారం
సీఐ చిన్న మల్లయ్య సస్పెన్షన్.. ఉత్తర్వులు జారీ చేసిన డి ఐ జి.సర్వ శ్రేష్ట త్రిపాఠి….
పల్నాడు
వినుకొండలో అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్న మల్లయ్యపై శాఖాపరమైన చర్యలు వేగవంతమయ్యాయి.
ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఆయనను గుంటూరు రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బ్రాహ్మణపల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు చిన్న మల్లయ్యపై అత్యాచార కేసు నమోదైంది.
ఘటన అనంతరం పరారీలోకి వెళ్లిన ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా…,
నాలుగు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








