
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
మోక్షాన్ని ప్రసాదించే శ్రీరామ నామం
శ్రీరాముడే సాటి. శ్రీరాముడు ఎక్కడా తాను భగవంతుడినని, సర్వశక్తి సమన్వితుడనని చెప్పుకోలేదు. మానవుడిలాగానే ఆయన యానం నడిచింది. కష్టాలు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఎలా మనిషి ప్రవర్తించాలో అలా ఆయన ప్రవర్తించి మానవాళికి చెప్పక చెప్పిన గురువయ్యాడు.
“వేద వేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసా దాసీ సాక్షాద్రామాయణాత్మనా”
అని వేద ప్రతిపాద్యుడైన పరమ పురుషుడు శ్రీమన్నారాయ ణుడే శ్రీరాముడై, దశరధ కుమారుడై అవనిలో జన్మించి అందరికీ ఆదర్శప్రాయుడై, మార్గదర్శియై వెలిసాడు. ఆయన యానమైన రామాయణము సర్వశాస్త్ర సారము. అవతార పురుషుడుగా జన్మించిన శ్రీరాముడు సామాన్య మానవుడిలా ప్రవర్తించి ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. దేవుడు మానవుడై, మానవుడిని దేవుడిగా చేయడానికి మార్గం చూపిన మహత్తర అవతారం. శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో, శ్రీరామావ తారమే అత్యంత ప్రాధాన్యత కలిగినది. మానవ జీవన సరళిలో స్వచ్ఛతను, పవిత్రతను కలకాలం దాటేది రామావతారమే. సత్యయుగానికి ఎన్ని కష్టాలు వచ్చినా, నిగ్రహంతో చివరి వరకు గాంభీర్యతను వ్యవహరించిన తీరుకు
राम “రామ” అనే రెండక్షరాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇష్టకామ్యాన్ని అందించి సర్వపాపాలు హరిస్తాయి. ఆ రాముడి గమనమే రామాయణం కదా!’రామ’ మంత్రం చాలా గొప్పదని, ఈ చరాచర జగత్తు అంత టిలో ‘రామ’ అను నామమే ఆలంబనయని, రామనామ సముద్భవమగుట చేతనే ప్రణవానికి మోక్షపద సామర్థ్యం కలిగినదని ఉపనిషత్తు ఉద్భోద. ‘రామ’లొ ‘రా’ అనేది బీజం ఇది దావాగ్నిలా పాపాలను దహించి వేస్తుంది. ‘మ’ అనేది అమృత బీజం, ఇది దావాగ్నితో ప్రక్షాళనమైన వారిపై అమృతాన్ని చిలికించి అమరత్వాన్ని అనుగ్రహిస్తుంది. ‘రామ’ అనే రెండక్షరాలను సదా స్మరిస్తే ప్రాణులన్నీ మోక్షాని పొందుతాయట. శ్రీరామ నామ మహిమ, నామానికి గల శక్తి అమోఘమైనది. సకల శుభ సంతోష ఆనంద ఐశ్వర్యాలనిచ్చే రామనామ స్మరణ మనలను సర్వదా రక్షిస్తుంది. శ్రీరామా’ అంటే చింతలేదు. “గోవిందా అంటే కొదవే లేదంటారు. కలియుగంలో శ్రీరామ నామం
! పరమోత్కృష్టమైనది. కృతయుగంలో ధ్యానంతో త్రేతాయుగంలో యజ్ఞాలతో, ద్వాపరయుగంలో పరిచర్యతో ఈ కలియుగంలో శ్రీరామ సంకీర్తనతో పొందవచ్చును. రామనామం ప్రాపంచిక దుఃఖాలను దూరం చేయడంలో మోక్షాన్ని కలిగించడంలో విశేషముంది. రామ నామం అనంత శక్తి సంపన్నమైనది. రామనామం జపించినా, రామాయణం విన్నా, పఠించినా, సర్వపాపాలు నశించి, ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం, చివరికి మోక్షం ఇస్తుందని హైందవుల అపార విశ్వాసం. అందుకే రాముడు ఆరాధ్యుడు. సర్వ ధర్మ స్వరూపుడు, రామాయణం ఆదికావ్యం అన్ని కాలాలకూ ఆదర్శం, వేటగాడి వేదన రామాయణమైంది. జనని వేదన జన్మకారణమైంది. రామాయణం భారతీయులకు ఉచ్చిన నిశ్వాసాల వంటిది. “చైత్రమాసే నవమ్యాంతు జాతో రామస్వయం హరిః పునర్వసు వృక్షసంయుక్తా సాతిథి సర్వకామదా!” చైత్రమాసంలో నవమినాడు పునర్వసు నక్షత్రంలో శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీరాముడుగా అవతరించాడు. అట్టి రామ జన్మదినం, సమస్త కోరికలను శుభాలను ప్రసాదించే దినం అని పురాణ ప్రవచనం. శ్రీరాముడు జన్మించిన రోజును మనం “ శ్రీరామ నవమి “గా నిర్వహించుకుంటాం !!







