
నారద వర్తమాన సమాచారం
స్వతంత్ర అభ్యర్ధులు విడదల రజిని, మురుగుడు లావణ్య కిడ్నాప్ ల కలకలం?
బాధిత బంధువులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు..
వైఎస్సార్సీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసినా తాము లొంగకపోవడంతోనే కిడ్నాప్‌లకు బరితెగించారని బాధితులు ఆగ్రహం
గుంటూరు పశ్చిమ, మంగళగిరి ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించిన, మహిళలను అపహరించిన ఘటనలు సంచలనం రేపుతోన్నాయి.
గుంటూరు జిల్లా
మంగళగిరిలో మురుగుడు లావణ్య అనే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించింది.
విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆమెను గృహనిర్బంధం చేశారు.
సమాచారం అందుకున్న టీడీపీ నేతలు మురుగుడు లావణ్య నివాసముంటున్న టిడ్కో నివాసాల వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున టిడ్కో నివాసాల వద్దకు రావడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు వేడెక్కాయి.
టీడీపీ నేతల రాకతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు అటువైపుగా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.అని ఆరోపించారు
గుంటూరు నగరంపాలెం పీఎస్ పరిధిలో మహిళ అపహరణ కేసు నమోదైంది.
తన భార్యను అపహరించారంటూ నగరంపాలెం పీఎస్‌లో ఏసుభుక్త నగర్‌కు చెందిన అను రాఘవరావు ఫిర్యాదు చేశారు.
విడదల రజని అనే మహిళ గుంటూరు పశ్చిమకు నామినేషన్ వేయడానికి ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో తన భార్య నామినేషన్ వేయకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారని రాఘవరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన భార్యను కారులో తీసుకెళ్లినట్లు చెబుతున్నట్లు వెల్లడించారు.
ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.