Thursday, December 12, 2024

జిల్లా కేంద్రంలో భారీగా నగదు రు. 1,99,97,500/- పట్టివేత

నారద వర్తమాన సమాచారం

జిల్లా కేంద్రంలో భారీగా నగదు రు. 1,99,97,500/- పట్టివేత

  • కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేరున ఉన్న వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్న అనంతపురం టూటౌన్ పోలీసులు
  • కేసు నమోదు…సీజ్ చేసిన నగదును అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగింత
  • నగదు పట్టుకున్న విషయాలపై మీడియాకు వివరాలు వెల్లడించిన అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి

  • జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్ సర్కిల్ లో మంగళవారం ఉదయం టూటౌన్ సి.ఐ క్రాంతికుమార్, ఎస్సై రుష్యేంద్ర బాబు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇంఛార్జి భీమలింగేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు
  • అటు వైపుగా వచ్చిన ఫార్చునర్ వాహనాన్ని వాహనాల తనిఖీ పోలీసులు ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు. అందులో రెండు బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న రూ. 1,99,97,500/- నగదును పోలీసులు సీజ్ చేశారు
  • ఫార్చునర్ వాహనం రికార్డులను పరిశీలించగా…సదరు వాహనం కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేరున ఉన్నట్లు తేలింది.
  • డ్రైవర్ వెల్లడించిన అంశాలను ఆధారంగా చేసుకుని పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు
  • సీజ్ చేసిన నగదు రూ. 1,99,97,250/- నగదును తదుపరి చర్యల నిమిత్తం అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి టూటౌన్ పోలీసులు అప్పగించారు.

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading