

ఓడిఎఫ్ లోని
ఆలయాన్ని సందర్శించిన నీలం మధు
రేణుక ఎల్లమ్మ, పోచమ్మ,
హనుమాన్ ఆలయం 12వ వార్షికోత్సవం
హోమం, ప్రత్యేక పూజలు..
కాంగ్రెస్ పార్టీ
గ్యారెంటీ కార్డులతో పూజలు
మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు శుక్రవారం ఎద్దు మైలారం (ఓడిఎఫ్)
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ12వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన అభ్యర్థి నీలం మధు, సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డిలను నిర్వాహకులు ఘన స్వాగతం, పలికి సత్కరించారు. ఆలయంలో నిర్వహించిన హోమం, ప్రత్యేక పూజల్లో వారు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు పండితులతో ఎంపీ అభ్యర్థి నీలం మధు పూజలు చేయించారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని నీలం మధు ఆకాంక్షించారు.







