

మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం: సిపిఎం జాతీయ నాయకులు సాయిబాబా.
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని సిపిఎం జాతీయ నాయకులు సాయిబాబా అన్నారు. భువనగిరి పార్లమెంట్ సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థి ఎండి జాంగీర్ గెలుపును కాంక్షిస్తూ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా సిపిఎం జాతీయ నాయకులు సాయిబాబా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభ ప్రసాదం విష్ణు అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతమని ఎర్రజెండా నాయకత్వంలో దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిన గడ్డ అన్నారు. అదే స్ఫూర్తితో బిజెపిని గద్దె దించే బాధ్యత మన అందరిని అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని విద్య వైద్యం కార్పొరేట్ లోకి వదలడంతో సామాన్యుడు బతుకు భారమైందన్నారు. దళితులు బడుగులు మహిళల మైనార్టీలపై దాడులు పెరిగాయని, రాజ్యాంగ సంస్థలే ఆయుధాలుగా రాజకీయాలు చేస్తున్నారని రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నారని, మతం ముసుగు తోడుకొని మతోన్మాదంని పెంచి భావోద్యోగాలతో పక్కదారి పట్టించే బిజెపి చేస్తుందని అన్నారు. ఒకే దేశం ఒకే పన్ను అని జీఎస్టీ ని తెచ్చి ప్రతి సరుకు మీద పన్ను విధించారని కానీ పెద్దలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారని మనం మాత్రం తిండే దాని మీద, వైద్యం ఫీజు మీద కూడా దయ దక్షిణాలు లేకుండా పన్నుల మీద పన్నులు వేసి సామాన్యుల వెన్ను విరుస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు బడా బాబుల నల్ల డబ్బులు తెల్ల డబ్బుగా మార్చేందుకే వరకు ఉపయోగపడిందని అన్నారు. వంటగ్యాస్ ధర 400 నుండి 1100 వరకు పెంచారని ఎన్నికలు వస్తున్నాయని కాస్త ధరను తగ్గించారని, మహిళ కార్మికుల స్థితిగతులు మరింత దారుణంగా పెరిగిందని కార్మిక వర్గం పై బిజెపి యుద్ధం చేస్తుందని బిజెపి 10 ఏళ్ల పాలనలో లక్ష మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక అడుగు కూడా ముందుకు వేయలేదని, వామపక్షాలు పార్లమెంటులో యూపీఏ కు మద్దతు ఇవ్వడం ద్వారా మహాత్మ గ్రామీణ జాతి ఉపాధి పథకాన్ని సాధించుకున్నామని అలాంటి చట్టాన్ని ఎత్తివేయడం కోసం బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. అందుకే బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. ఆశాస్త్రీయ అసమగ్ర తప్పుడు చరిత్రతో మూఢనమ్మకాలతో వ్యాపార దృక్పథంతో నింపాలని చూస్తున్నారు. ప్రజలకు విద్య తర్వాత అత్యంత భారం అవుతున్నది వైద్యం అని వైద్య ఖర్చులే ప్రధానంగా కారణంగా ఉంది వైద్యాన్ని పాలకులు గాలికి వదిలేశారు. దేశ వైద్యరంగం చావుకు హామీ ఇస్తున్నట్టుగా బిజెపి ప్రభుత్వం చేస్తా ఉంది. మోడీ అధికారంలోకి వచ్చే ముందు భేటీ బచావో బేటి పడావో నినాదం మహా గొప్పగా ఇచ్చాడు కానీ మహిళలపై సామూహిక లైంగిక దాడి జరిగితే ప్రధాని కనీసం కూడా స్పందించలేదు. ప్రభుత్వం అధికారంలోకి రాక ముందుకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఏమాత్రం లేదని పార్లమెంటులో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం ఏడు వేల ఉద్యోగులు మాత్రమే కల్పించారని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వారిపై బిజెపి కార్యకర్తలు కాల్పులు జరిపి తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్నారని, వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకుండా మోడీ ప్రభుత్వం వచ్చాక అడవుల్లో నివసించే గిరిజనులను టార్గెట్ చేశారు. తమ దోస్తులైన బడా కంపెనీలకు అడవుల్లో ఉన్న ఖనిజాలను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అడవిలో వారికి ఉన్న పేగు బంధాన్ని తెంచి అక్కడి నుంచి తరమాలని కుట్రపన్నారు. తెలంగాణలో నల్లమల్ల మీద కేంద్రం కన్ను పడింది అటవీ హక్కుల ప్రకారం గిరిజనలకు అక్కుపత్రాలు ఇవ్వలేదు. మణిపూర్లో గిరిజన మహిళలపై బహిరంగంగా నగ్నంగా ఊరేగించి సామూహిక లైంగిక దాడి చేస్తే స్పందించలేదు ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభించిన మాట లేదు ఇది బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని అవినీతిపై పోరాటం చేస్తున్నానని మోడీ గొప్పలు కొడుతుంటారు కానీ దేశంలో అత్యంత అవినీతి పార్టీగా బిజెపి మారిందని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రభుత్వాన్ని అధికారాన్ని ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే మోడీ ప్రభుత్వం దేశద్రోహం ఉందని అందులో 95% మంది ఇప్పటికి జైల్లో మగుతున్నారని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత చట్టసభ అయినా పార్లమెంట్ సమావేశాలు తూతూ మంత్రంగా జరిపి బిల్లుల ఆమోదం చేసుకొని బయటపడుతున్నారు. దేశ భవిష్యత్తు నిర్ణయించే బడ్జెట్ కేటాయింపులపై కూడా చర్చ లేదని ఇట్లాంటి నాయకులను పార్టీలో ఎన్నుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని చేతులారా నియంతలకు అప్పజెప్పడమే అని అందుకే బిజెపికి ఓటు ప్రజాస్వామ్యానికి చేటు అని గుర్తు పెట్టుకోవాలని వారు కోరారు. ఇప్పుడు ఉన్న మత రాజ్యాలు ఏమన్నా బాగుపడ్డాయా మతం ఆధారంగ నాకంటే వెనకబడి ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు మతం ఆధారంగా నడిచే దేశాలు కావని వాటికి పాలనతో మతంతో సంబంధం ఉండదని అందుకే అవి అభివృద్ధి చెందాయి మతం విశ్వాసం దేవుడి మీద నమ్మకం వ్యక్తిగతమని అన్నారు. మతాన్ని వాడుకుంటున్నాయని మతపరమైన విభేదాలను సృష్టించి హిందువుల ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తూ బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు. అందుకే మతం పేరుతో రెచ్చగొట్టే ఉపన్యాసాలను వారు చేస్తున్నారని అన్నారు. మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించి ప్రజా గొంతుక నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పార్లమెంటులో మన గొంతును సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థిని ఓట్లు వేసి పార్లమెంటుకు పంపిస్తే నిత్యం ప్రజా సమస్యలపై కార్మిక విద్యా వైద్య రంగ సమస్యలపై నిరంతరం పార్లమెంటులో గొంతును వినిపిస్తూ మన సమస్యలు పరిష్కారం దిశగా ఉంటుందని అందుకే సిపిఎం పార్టీ అభ్యర్థి బోనగిరి పార్లమెంటు నుండి పోటీ చేస్తుందని సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జాంగిర్ ని బరిలో ఉంచామని జాంగిర్ నిత్యం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన వ్యక్తికి ఓట్లు వేసి గెలిపిస్తే పార్లమెంటులో ప్రజా గొంతుక వినిపిస్తాడని కోరారు. అందుకే ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. పోచంపల్లి మండలానికి చెందిన సిపిఐ నాయకులు జాతీయ నాయకుల సమక్షంలో ఈరోజు సిపిఎం పార్టీలో చేరడం జరిగింది. వీరితో పాటు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహ, వెంకటేశు కూరపాటి రమేష్, మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి, పట్టణ కార్యదర్శి కార్యదర్శి కోడే బాల నరసింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కోటా రామచంద్ర రెడ్డి, మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి, పట్టణ మండల కమిటీ సభ్యులు బిక్షపతి, లక్ష్మయ్య, జగన్, మల్లారెడ్డి, కోట రమేష్, సాయినాథ్, గూడూరు రాంరెడ్డి, సత్తయ్య, సత్తిరెడ్డి, ఎస్ డబ్ల్యూ ఎఫ్ సిఐటియు అనుబంధ సంస్థ నాయకులు కుంభం జనార్ధన్, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.