నారద వర్తమాన సమాచారం .
అమరావతి లో ముఖ్యమంత్రి 12 మందికి ఇచ్చిన హామీలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
ఏప్రిల్ 15న అమరావతి మండల కేంద్రంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా, వారితో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను విన్నారు.
మొత్తం 12 మంది సమస్యలను విన్న ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు వారి సమస్యలు విని ఆ వెంటనే సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
ఆ సమస్యలపై శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో 12 మంది సమస్యల ను దృష్టిలో ఉంచుకొని, ఆయా జిల్లా అధికారుల తో సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో జిల్లా అధికారు లు పాల్గొని వెంటనే సమస్యలపై ఆ 12 మందిని ప్రశ్నించి వారి సమస్యల ను తెలుసుకొని పరిష్కారం దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.
ఈ సమీక్షలో పల్నాడు జిల్లా ప్రత్యేక అధికారి మరియు సత్తెనపల్లి ఆర్డీవో శ్రీరాములు, జిల్లా డి.ఆర్.డి.ఏ పి.డి ఝాన్సీ రాణి,హౌసింగ్ డి.ఈ సుబ్బారావు,ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ డిస్టిక్ కమిషనర్ జి.చంద్రశేఖర్,ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్.ఈ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








