

నారద వర్తమాన సమాచారం
జాడి కీర్తి బాయి లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు : మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు
కారు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఐటి,పరిశ్రమలు & శాసన సభ వ్యవహారల శాఖ మంత్రి శ్రీధర్ బాబు & పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ
జాడి కీర్తి బాయి లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఐటి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమానికి వెళుతుండగా మహాముత్తారం మండలం నిమ్మ గూడెంలో జరిగిన ప్రమాదంలో మహాముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,మండల అధ్యక్షురాలు జాడి కీర్తి బాయి, ఆమె భర్త జాడి రాజయ్య ఇద్దరు కారుకు ప్రమాదం జరగడంతో ప్రమాదంలో జాడి కీర్తి బాయి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కొరకు ఆసుపత్రి తరలించారు.విషయం తెలుసుకున్న ఐటి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు & పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ కారు ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.కారు ప్రమాదం జరిగిన వివరాలను పోలీస్ లను అడిగి తెలుసుకున్నారు.
ఐటి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు & పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ వారి పార్ధివ దేహానికి పుష్పాంజలి ఘాటిస్తూ నివాళులార్పిస్తూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి… వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మహా ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు సోదరిమణి జాడి కీర్తి బాయి ఆకస్మాత్తుగ కారు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం.యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలందరిని ఈ సంఘటన తీవ్ర దిగ్బ్రాంతి గురి చేసింది.
క్రమ శిక్షణ గల కార్యకర్త, నాయకురాలిగా ధైర్య వంతురాలిగా అనేక సందర్బలలో ఆనాడు ఉన్న టీఆరెఎస్ ప్రభుత్వం మహిళ అని చూడకుండా ఇబ్బందులు పెట్టిన కూడా దైర్యంగా జాయించి కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడిన సోదరిమణి (చెల్లలు) జాడి కీర్తి బాయి అనుకోకుండా నిన్న సాయంత్రం కారు ప్రమాదం జరగడం ప్రమాదంలో సోదరిమణి మృతి చెందడం, వారి భర్త మాజీ సర్పంచ్ రాజయ్య కి తీవ్రమైన గాయాలు కావడం వెను వెంటనే ఆసుపత్రి కి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కొరకు వరంగల్ లోని అజరా ఆసుపత్రి కి తరలించి చికిత్స చేస్తూన్నారు.కీర్తి బాయి పార్టీ వ్యవస్థలకు ఆదర్శనియంగా కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి స్థాయిలో నమ్మకం విశ్వాసం ఉంచి ముందుకు నడిచారు. మహా ముత్తారం మండలానికి సంబందించిన పేద వర్గాలకు ఒక నాయకురాలిగా నిలబడ్డ సోదరిమణి, సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి పార్టీలో పని చేస్తూ… పదవి ఉన్న లేకున్నా పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేస్తూ.. పని చేశారు.
ప్రతి కార్యకర్త,నాయకుని ఇంటికి మంచి జరిగిన ఏదైనా అపద వచ్చిన నేను ఉన్నానని ఎవరు వచ్చిన రాకున్నా నేను ఉన్నానని దైర్యం చెప్పిన సోదరిమణి జాడి కీర్తి బాయి చనిపోవడం చాలా బాధాకరం.
వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడుతాయి.
వారి పిల్లలకు వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ వార్త వినగానే దిగ్బాంది చెందారు.రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి దైర్యం చెప్పాలని అండగా నిలబడతామని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాము.
ఈ వార్త తెలియగానే ఈ రోజు యువకుడు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ కృష్ణ ప్రచారం ఉన్నప్పటికీ కూడా హుటా హుటినా ఇక్కడికి వచ్చి వారి కుటుంబానికి దైర్యం చెప్పారు.
అదే విధంగా భూపాలపల్లి జిల్లా మహిళ నాయకురాలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు వారికి నివాళులార్పించారు.
ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ… ఆమె లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాము.వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఐటి,పరిశ్రమలు & శాసనసభ వ్యవహారల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు వెంట పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ భూపాలపల్లి ,నాయకులు, ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.