

నారద వర్తమాన సమాచారం
పండగలా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రచార ర్యాలీ
-సత్తెనపల్లి – నరసరావుపేట వరకు జనసంద్రమైన రహదారులు
-ట్రాక్టర్ ర్యాలీతో సంబరంగా ప్రజలు
ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు ప్రచార ముగింపు ర్యాలీ ఈరోజు ఘనంగా జరిగింది. సత్తెనపల్లి నుండి నరసరావుపేట పట్టణం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. లావు శ్రీ కృష్ణ దేవురాయలుకి మద్దతు తెలిపేందుకు పల్నాడు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి.. సంబరంగా ర్యాలీలో పాల్గొన్నారు. మేము శ్రీ కృష్ణ దేవరాయలు వెంటే ఉన్నాం అని ప్రజలు హోరెత్తారు.