ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది : జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
48 గంటల నిశ్శబ్ద కాలంలో చేయవలసిన,చేయకూడని అంశాలపై ప్రెస్ మీట్
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే11,
లోక సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి శనివారం సాయంత్రం 6 గంటల నుండి నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ చెప్పారు. ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఎస్పీ కాజల్ లతో కలిసి 48 గంటల నిశ్శబ్ద కాలంలో చేయవలసిన, చేయకూడని అంశాలపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, ఐదుగురికి మించి ఒకే చోట గుమికూడరాదన్నారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. డబ్బు, మద్యం, విలువైన బహుమతులతో ఓటర్లను ప్రభావితం చేయడం సెక్షన్ 171 ప్రకారం నేరమని, వాటి నిరోధానికి ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలతో విస్తృతి తనిఖీలు చేపట్టామని అన్నారు. ఏదేని తమ దృష్టికి వస్తే సి-విజిల్ ద్వారా, లేదా 1950 ద్వారా సమాచారమందించాలని కోరారు. పోలింగ్ నాడు 100 మీటర్ల ఆవల తెల్ల కాగితంపై ఓటరు స్లిప్పులు అందించాలని, పోలింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 చట్టం లోని 126 సెక్షన్ ప్రకారం పుట్టిన రోజు, తదితర ఉత్సవ కార్యక్రమాల్లో ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదని, అదేవిధంగా సెక్షన్ 126(1)(బి) ఆర్ పి యాక్ట్ 1951 ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో రాజకీయ ప్రకటనలు వేయడం, ప్రసారం చేయడం శిక్షర్హమని అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేయించి, డ్రై డేగా ప్రకటించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ ఉదయం 7 నుండి సాయంత్రం 6 ;గంటల వరకు కొనసాగుతుందని, 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని, అంధులు అభ్యర్థి ఫోటో, పేరు, గుర్తు ఉంటాయని గమనించి ఓటు వేయాలని, వివిప్యాట్ ద్వారా ఓటు వేసినట్లు బీపీ శబ్దం వస్తుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో షామియానా, మంచినీరు, తదితర మౌలిక సదుపాయాలూ కల్పించామని వృద్దులు, దివ్యంగులకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాహన సౌకర్యం కల్పిస్తున్నామని,12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తేవాలని సూచించారు. ఈవీఎం , వివిప్యాట్ లలో ఎటువంటి సందేహం అవసరం లేదని, ఉదయం 5.30 గంటలకు రాజకీయా పార్టల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ఈవీఎం ల సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే సమీపంలోని సెక్టోరల్ అధికారులు రీప్లేస్ చేసేతారని అన్నారు. గత శాసన సభ ఎన్నికలలో 80 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి వంద శాతం అయ్యేలా చూడాలన్నారు.అసత్య వార్తలు ఎన్నికల సరళిని ప్రభావితం చేసే అవకాశమున్నందున మీడియా ఒకటికి రెండు మార్లు అట్టి వార్తను రూడి చేసుకోవాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జర్నలిస్ట్ కండక్ట్ నార్మ్స్ 2022, యెన్.బి.ఎస్.ఏ. జారీచేసిన మార్గదర్శకాలను,వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ననుసరించి మీడియా తమ వార్తలను ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ సైలెన్స్ పీరియడ్ లో ఇతర నియోజక వర్గ ప్రజలు ఎవరు ఉండరాదని,హోటల్స్, లాడ్జింగ్ లు తదితర వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని అన్నారు. సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమలులోకి వచ్చిందని, 5 గురు కంటే ఎక్కువ గుమికూడరాదని అన్నారు.మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టమని, మీ దృష్టికి వస్తే సి-విజిల్ ద్వారా తెలపాలని కోరారు. అసత్య వార్తలు ప్రసారం చేస్తే ఐపీసీ,ఐపి, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటర్లను వాహనాలు చేరవేయడం, పోలింగ్ కేంద్రాలకు మొబైల్ తీసుకురావడం నిషిద్ధమని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటి 91 లక్షల నగదుతో పాటు 6,790 లీటర్ల మద్యం పట్టుకొని కేసులు నమోదు చేశామని అన్నారు. గత శాసనసభలో రౌడీషీటర్లతో పటు కొత్తగా 583 మందిని బైండ్ ఓవర్ చేశామని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామని ఎస్పీ చెప్పారు.లోక సభ ఎన్నికాలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాగా నిర్వహించుటకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.