నారద వర్తమాన సమాచారం
మీరేసే ఓటు సమస్యలపై పోరాడెందుకు శక్తి నిస్తుంది
బ్యాలెట్ నెంబర్ ఆరులో కోటు గుర్తుకే ఓటు వేయండి.
తేదేపా మాజీ కౌన్సిలర్ పున్నయ్య నాయక్ తో జొన్నలగడ్డ భేటీ
నియోజవర్గంలో విస్తృత ఎన్నికల ప్రచారంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ విజ్ఞప్తి
ప్రజలు వేసే ప్రతి ఓటు ప్రతి ఒక్కరి సమస్యల పై మాలాంటి వారు ప్రశ్నించి పోరాడెందుకు శక్తి నిస్తుందని ఈవీఎం బ్యాలెట్ నెంబర్ ఆరులో కోటు గుర్తు కే ఓటు వేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావటంతో శనివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి, ముప్పాళ్ల మండలం, సత్తెనపల్లి పట్టణంలో ఉదయం నుంచే విస్తృత ప్రచారం చేస్తూ అయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్, నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే గొంతుకైన మాకు మీరేసే ఓటు పోరాటాలకు శక్తి నిస్తుందని చెప్పారు. నేను స్థానికుడ్ని…యువకుడ్ని విద్యావంతుడ్ని 24 గంటలు అందుబాటులో ఉంటానని ప్రజాసేవకే వచ్చిన నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
తెదేపా మాజీ కౌన్సిలర్ పున్నయ్య నాయక్ తో జొన్నలగడ్డ భేటీ
తేదేపా మాజీ కౌన్సిలర్ కెతావత్ పున్నయ్య నాయక్ తో జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలో పేదలకు సముచిత స్థానం కల్పించేది కేవలం జేబీపీ అని అధైర్య పడకు పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ నేను మీకు అండగా ఉంటాం కలిసి పని చేద్దామని భరోసానిచ్చారు.. చిన్నారులతో క్రికెట్ ఆడి సందడి చేసిన జొన్నలగడ్డ
ఎన్నికల ప్రచారంలో భాగంగా
జొన్నలగడ్డ విజయ్ కుమార్ సత్తెనపల్లి పురవీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఎనిమిదదో వార్డు లో చిన్నారులు క్రికెట్ ఆడుతుండంతో వారి వద్దకు వెళ్లి ఏం చదువుతున్నారు…ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి… ఆరోగ్యం జాగర్త ఎండలకు బయటకు తిరగకండి అంటూ అయన వారికి సూచించారు. ఈ నేపథ్యంలో జొన్నలగడ్డ విజయ్ కుమార్ చిన్నారులతో కొద్ది సేపు క్రికెట్ ఆడి సందడి చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.