
నారద వర్తమాన సమాచారం
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం
మే : 12,
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం
అంతర్జాతీయ మాతృ దినోత్సవం (మదర్స్ డే) కని పెంచిన తల్లి యొక్క గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ఎక్కువ దేశాలలో ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న అమ్మా అనే దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదట గ్రీస్ దేశంలో నిర్వహించారు. కనిపించే దైవం అమ్మ. ప్రపంచంలో అన్నిటి కంటే తల్లి ప్రేమ ఎంతో గొప్పది. అలాంటి మాతృమూర్తుల కోసం ఈరోజు అంకితం.