
నారద వర్తమాన సమాచారం
మే :25
ఆరోగ్య శ్రీ సేవలపై సీఎస్‌తో ముగిసిన భేటీ.. సేవలు పునఃప్రారంభం
మూడో రోజు కూడా ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. నెట్‌వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ కంటిన్యూ చేయడంతో మూడో రోజూ సేవలు నిలిచిపోయాయి. దీంతో నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలిశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడదల చేయాలని కోరారు.
హాస్పిటల్స్ నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎస్‌కు వివరించారు డాక్టర్ రమేష్. పెండింగ్ నిధుల విడుదలపై సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు డాక్టర్ రమేష్. అన్ని ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయిన తర్వాత తమ నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారాయన. మరోవైపు ఆరోగ్యశ్రీ సీఈవో కూడా కీలక ప్రకటన విడుదల చేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని నెట్‌వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలను కోరామన్నారు. వారి దానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మొత్తంగా సీఎస్ జవహర్‌రెడ్డి హామీతో నెట్‌వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు కాస్త కన్విన్స్ అయ్యినట్లు తెలుస్తోంది.
ఆరోగ్యశ్రీ సేవల పునరుద్దరణపై ఇవాళో, రేపో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఆరోగ్య శ్రీ సేవలు అమలు చేయడం కోసం ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని నెట్ వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. దీనిపై గతంలో ఈసీ స్పందించింది. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తే ఆయా ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
దీంతో ప్రస్తుతం సేవలు తీసుకుని చికిత్స పొందుతూ ఉన్న వారిని మినహాయించాయి ఆసుపత్రులు. కొత్తగా వచ్చే వారికి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. దీంతో సీఎస్ నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ను ఈరోజు భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై వెలువడే నిర్ణయం కోసం చాలా మంది చికిత్స తీసుకునే వారిలో ఉత్కంఠ నెలకొంది. అలాగే కొత్తగా సేవలను వినియోగించుకునే వారు కూడా ఒక స్పష్టమైన సమాచారం కోసం ఎదురు చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.