
నారద వర్తమాన సమాచారం
మే ;26
కోరిక తీర్చాలని అధికారి ఉద్యోగినిపై వేధింపులు..
డిప్యూటేషన్ మీద వచ్చిన ఓ ఉద్యోగినిపై ఓ అధికారి కీచకుడిగా మారారు. ‘నీ డిప్యూటేషన్ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నా స్నేహితుడికి లాడ్జి ఉంది. లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరకుంటే కంభం వచ్చినా సరే.. రాకుంటే నీ డిప్యుటేషన్ రద్దు చేయిస్తా’ ఇవి ఓ కామాంధ అధికారి మాటలు. ఈ మాటలు విన్న ఆ ఉద్యోగి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులకు శనివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.