నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నేషనల్ హైవే..
పిడుగురాళ్ళ మీదుగా… హైదరాబాద్‌కు కనెక్టవిటీ
ఆంధ్రప్రదేశ్
- ఆంధ్రప్రదేశ్ లో మరో నేషనల్ హైవే పనులు వేగవంతం
- వాడరేవు- పిడుగురాళ్ల నేషనల్ హైవే 167ఏ
- బాపట్ల జిల్లాలో పనుల్ని వేగవంత చేశారు
- ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనులు వేగవంతం చేశారు
- జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాలో రూపురేఖలు మారుతున్నాయి.
- కోస్తాలో కీలకమైన వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో స్పీడ్ పెంచారు.
- ఈ 167ఏ నేషనల్ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలో జరుగుతున్నాయి.
- ఈ మేరకు పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచేడు మీదుగా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణం పనుల్లో వేగం పెంచారు.
- ఈ హైవే నిర్మాణంతో పాటుగా కల్వర్టులు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ల పనులు చేపట్టారు.
- ప్రస్తుతం చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణాలకు సమీపంలో ఉన్న గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి.
- హైవే అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి
- 167 ఏ హైవేలో వాడరేవు – పిడుగురాళ్ల వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తోంది..
- ఈ మేరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది.
- హైదరాబాద్ నుంచి వాడరేవు రవాణాకు ఉపయోగంగా ఉంటుంది.
- ఈ మేరకు మోటుపల్లి, పెద్దగంజాం ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే ట్రాక్ కూడా ఉండడం కూడా కలిసొస్తుంది అంటున్నారు.
- ఈ హైవే నిర్మాణంతో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా మరింత సులువు అవుతుంది.
- చీరాల ప్రాంతంలో వాడరేవు ఉండడంతో పర్యాటన రంగం కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు.
- వాణిజ్య వ్యాపారాల సైతం హైవే నిర్మాణంతో మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
- అలాగే ఈ హైవే హైదరాబాద్ (అద్దంకి- నార్కెట్‌పల్లి)కు కూడా కనెక్ట్ అవుతోంది.
- నేషనల్ హైవే 167-A విస్తరణ ప్రాజెక్ట్ వాడరేవు-పిడుగురాళ్ల మధ్య నాలుగు లేన్లుగా చేపట్టారు.
- 85 కిలోమీటర్లకుపైగా ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.1,064.24 కోట్ల వ్యయం అవుతోందని అంచనా వేశారు.
- నెకరికల్లు దగ్గర
- అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్,
- చీరాల దగ్గర
- నేషనల్ హైవే 216,
- చిలకలూరిపేట దగ్గర నేషనల్ హైవే 16 కి అనుసంధానం చేస్తున్నారు.
- వాడరేవు నుంచి ఈపురుపాలెం వరకు 18 కిలో మీటర్లు కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. పర్చూరు, *
- తిమ్మరాజుపాలెం, చిలకలూరిపేట దగ్గర బైపాస్‌లు ఉంటాయి.
- ఈ హైవేతో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహంతో పాటుగా బాపట్ల-ఓడరేవు మధ్య బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు.
- కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ.. ట్రాఫిక్ తగ్గించడానికి, కనెక్టివిటీ మెరుగుపర్చడానికి బైపాస్‌లు, సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు ఉన్నాయి.
- మరోవైపు ఈ 167ఏ వాడరేవు-పిడుగురాళ్ల హైవేలో కీలకమైన నరసరావుపేట బైపాస్ సర్వే మొదలైంది.
- భూసేకరణ కూడా నరసరావుపేట బైపాస్ మినహా మిగతా అన్నిచోట్లా పూర్తికాగా..
- అలైన్‌మెంట్ మార్చాలని కొందరు రైతులు కోరారు. కానీ జాతీయ రహదారి అథారిటీ అధికారులు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు.
- డీపీఆర్‌కు అనుగుణంగానే కేసానుపల్లి, జొన్నలగడ్డ, రావిపాడు మీదుగానే బైపాస్ నిర్మించేలా ముందుకెళ్తున్నారు
- ఈ మేరకు సర్వే పనుల్లో బిజీగా ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.