![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/06/image_editor_output_image15725073-17175159858272641167588202264074-300x226.jpg?resize=300%2C226&ssl=1)
నారద వర్తమాన సమాచారం
జూన్ :04
ప్రజల తీర్పును గౌరవిస్తాం…ధైర్యంగా ముందడుగు వేస్తాం
ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి
మంచి చేసినా ప్రజలు ఓడించారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి,ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాలను చవిచూసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ‘ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నాం. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యాం. 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకున్నాం. అరకోటి రైతన్న ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు. డ్వాక్రా మహిళలు, ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నాం. ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయాం. మ్యానిఫెస్టో హామీలను 99 శాతం అమలుచేశాం. పేద పిల్లల చదువుల కోసం ఎంతో సాయం చేశాం. గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేశాం. అయినా, ప్రజల తీర్పును తాము తీసుకుంటాం. మంచి చేయడానికి ఎప్పుడూ ముందుంటాం. పేదవాడికి అండగా ఉంటూ గళం విప్పుతాం. కూటమిలోని బీజేపీ , చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు. ఎన్ని చేసినా మా ఓటు బ్యాంకును 40 శాతానికి తగ్గించలేకపోయారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకుసాగుతామని జగన్ వ్యాఖ్యానించారు.
ప్రజలు బాగుండాలని మంచి చేశాం. మంచి చేసినా ఓటమిపాలయ్యాం. ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు. మహిళలకు సంక్షేమ ఫలాలు అందించాం. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. చాలానే చేశాం. 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేశాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తే చాలీచాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేశాం. అవ్వాతాతల ప్రేమ ఏమైందో తెలియదు?. కోటి ఐదు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు మంచి చేశాం. వాళ్ల కష్టాల్ని మా కష్టాలుగా భావించాం. ఎన్నో మార్పులు తెచ్చాం. అక్కా చెల్లెమ్మలకు అండగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో తెలియదు?. రైతన్నలకు ఎంతగానో తోడుగా నిలిచాం. అన్నదాతలకు రైతు భరోసా అందించాం. అర కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు?. పేదవాళ్లకు తోడుగా ఉన్నాం. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా ఉన్నాం. వాళ్లకు వాహనమిత్ర ఇచ్చాం. మత్స్యకార భరోసా, నేతన్న చేయూత అందించాం. రాష్ట్రంలో కోట్ల మందికి మంచి చేశాం. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించాం. జగన్ తీర్పును గౌరవిస్తాం. అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాం. పేదలకు సంక్షేమ పథకాలు అందించాం. గతంలో ఎప్పుడూ జరగనంత మంచి చేశాం. ప్రజల తీర్పును గౌరవిస్తాం. ధైర్యంగా ముందడుగు వేస్తామన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.