

నారద వర్తమాన సమాచారం
జూన్ :05
ప్రజా నేతకి పట్టం కట్టిన పల్నాడు ప్రజలు
1,59,729 ఓట్ల మెజారిటీతో లావు శ్రీ కృష్ణ దేవరాయలు విజయం
నిరంతరం ప్రజా సేవని కాంక్షిస్తూ, పల్నాడు అభివృద్ధి కోసం పరితపించే ప్రజా సేవకుడు లావు శ్రీ కృష్ణదేవరాయలుకి పల్నాడు ప్రజలు పట్టం కట్టారు. మనసారా ఆశీర్వదించి 1,59,729 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్ సభ్యునిగా విజయాన్ని అందించారు. తమతో అనునిత్యం తోడుగా ఉండే నాయకుడిని అక్కున చేర్చుకున్నారు.
పల్నాటి ప్రజల కష్టానికి వెల కడుతూ, వారి బాధలను కడ తేర్చే విధంగా పార్లమెంట్ సభ్యునిగా గెలిచి.. ధ్రువీకరణ పత్రాన్ని జెఎన్ టియు నరసరావుపేట కళాశాలలో జిల్లా అధికారుల చేతుల మీదుగా లావు శ్రీకృష్ణదేవరాయలు అందుకున్నారు. తన విజయానికి మూలమైన పల్నాడు ప్రజానీకానికి పేరుపేరునా లావు శ్రీకృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలిపారు.








