నారద వర్తమాన సమాచారం
జూన్ :06
నూతన ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి..
- మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి కి విజ్ఞప్తి చేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు…
గుంటూరు – జూన్ 6- ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషి చేయాలని ఏపీడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్రం మాజీ కార్యదర్శి నిమ్మ రాజు, చలపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకే మోహన్ రావు లు విజ్ఞప్తి చేశారు. సత్తనపల్లి ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ ను గుంటూరులోని ఆయన స్వగృహంలో గురువారం ఏపీడబ్ల్యుజే నాయకులు చలపతిరావు, మోహన్ రావు లు కలసి అభినందించారు. ఈ సందర్భంగా నిమ్మ రాజు చలపతిరావు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం నాటి ఆంధ్ర పత్రిక మూతపడిన సమయంలో ఏపీడబ్ల్యుజే నాయకులు కే శ్రీనివాసరెడ్డి, స్వర్గీయ అంబటి ఆంజనేయులు నాయకత్వంలో ఆంధ్ర పత్రిక లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాల బకాయిల కోసం పోరాటం చేశారని, అప్పట్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ యాజమాన్యాల తో మాట్లాడి ఉద్యోగులకు జీతభత్యాలు పూర్తిగా ఇప్పించారని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రానున్న ప్రభుత్వంలో తన వంతు సహాయ సహకారాలు అందించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతోపాటు, సంక్షేమ కార్యక్రమాలను అమలు కృషి చేయాలని కోరారు. అనంతరం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి ని కలసి అభినందించిన చలపతిరావు, మోహన్ రావు లు మాచర్ల నియోజకవర్గంలో జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై విచారణ చేయించి చర్యలు చేపట్టాలని కోరారు. జర్నలిస్ట్ యూనియన్ నాయకుల విజ్ఞప్తులకు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి లు సానుకూలంగా స్పందించారు. తమను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డిలు కృతజ్ఞతలు తెలియజేశారు. పల్నాడు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఉద్రేకాలకు లోనై గొడవలకు వెళ్లవద్దని, పల్నాడు జిల్లా శాంతియుతంగా ఉండాలని కాంక్షిస్తున్నామని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.