
నారద వర్తమాన సమాచారం
జూన్ :09
ఏలూరు జిల్లా :
30కోట్ల పొలిటికల్ బెట్టింగ్ డబ్బుతో అదృశ్యమై, శవమై తేలిన వైసీపీ నాయకుడు
నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామంలోని కోళ్ళ ఫారం షెడ్ లో వైసీపీ నాయకుడు జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానస్పదకరంగా మృతదేహాం లభ్యం.
రాజకీయంగా పందేలు కాసిన సుమారు 30కోట్ల సొమ్మును నమ్మకమైన మధ్యవర్తిగా భావించి వేణుగోపాల్ రెడ్డి వద్ద వుంచిన పందెపురాయుళ్ళు.
గత కొన్ని రోజులుగా పందెపు డబ్బుతో అదృశ్యమైన వేణుగోపాల్ రెడ్డి కోసం గాలిస్తున్న సమీప గ్రామాల ప్రజలు.
వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని పంచనామాకు తరలించి, దర్యాప్తు చేపట్టిన నూజివీడు రూరల్ పోలీసులు.








