నారద వర్తమాన సమాచారం
జూన్ :19
చిలకలూరాపేట
ప్రజా ప్రభుత్వంతో స్థానిక సంస్థలకు మళ్లీ మంచి రోజులు: ప్రత్తిపాటి
ప్రత్తిపాటికి శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టినా దంపతులు
ప్రజా ప్రభుత్వంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థలు అన్నింటికీ మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. వైకాపా అయిదేళ్ల పాలనలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు, గాడి తప్పిన పాలన అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో తిరిగి పట్టాలెక్కడం, చక్కబడడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. పైగా ఉపముఖ్యమంత్రి పవన్ వద్దనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉండడం ఇప్పుడొక గొప్ప అవకాశంగా అభివర్ణించారాయన. బుధవారం ప్రత్తిపాటిని ఆయన నివాసంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేశ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగానే క్రిస్టినా దంపతులను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు ప్రత్తిపాటి పుల్లారావు. బీఆర్‌ఐజీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులతో కలిసి ప్రత్తిపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది, ఏఐటీయూసీ ప్రతినిధులు ప్రత్తిపాటిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల పరిపాలనకు కేంద్ర బిందువైన జిల్లా పరిషత్తు కార్యాలయం ద్వారా గ్రామాల అభివృద్ధి దిశగా కృషి చేయాలని సూచించారు. పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టి కృషితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేసి మరింత అభిృవద్ధిని సాధించాలని ఆకాంక్షించారు ప్రత్తిపాటి. సాధ్యమైనంత వేగంగా జడ్పీ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారందర్నీ కోరారు. జడ్పీ నిధులతో ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని… ఆ అవకాశాన్ని అధికారులంతా ఉపయోగించుకుని ప్రజలకు మేలుచేయాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.