నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలోని పురుగు మందులు మరియు విత్తనాల షాపులను, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా షాపు యజమానుల దగ్గర సోర్స్ సర్టిఫికేట్ లేని స్టాక్ కు అమ్మకాలను నిలుపుదల చేశారు. ఈ స్టాక్ విలువ రూ.92,200/-. అదేవిధంగా రైతులకు అధిక ధరలకు ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాలు అమ్మినచో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కే రమణ కుమార్ (AO) మరియు పిడుగురాళ్ల మండల వ్యవసాయ అధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు








