కేరళ వయనాడ్ బాధితులకు సలార్ సహాయం
తెలంగాణ
వయనాడ్ బాధితుల కోసం ఈరోజు సలార్ సహాయం చేశాడు రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు.ప్రభాస్
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సాయం ప్రకటించారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రభాస్ కూడా చేరారు.వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెబల్ స్టార్ ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు.
వయనాడ్‌లో కొండచరి యలు విరిగిపడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు సినీ పరిశ్ర మలోని పలువురు స్టార్స్ విరాళాలు ఇస్తున్నారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సాయం ప్రకటించారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రభాస్ కూడా చేరారు. ఇటీవల మోహన్ లాల్ రూ.3 కోట్లు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25, లక్షలు రష్మిక 10 లక్షల విరాళం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు.
నయనతార, విఘ్నేశ్ దంపతులు రూ.20 లక్షలు, హీరో విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య, జ్యోతిక, కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు అందించారు. నటులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు ఇచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








