నారద వర్తమాన సమాచారం
సత్తెనపల్లిలో ఎరువుల దుకాణం పై లీగల్ మెట్రాలజీ మరియూ విజిలెన్స్ కమిటి ఆధ్వర్యంలో దాడులు
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి :
లీగల్ మెట్రాలజీ అధికారులు మరియు రాష్ట్ర విజిలన్స్ కమిటి మెంబర్ డా. చదలవాడ హరిబాబు ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్ లోని ఎరువుల దుకాణాలలో పురుగు మందుల డబ్బాలపై ప్యాక్డ్ కమోడిటీస్ యాక్ట్ క్రింద ముద్రలు సక్రమంగా వున్నది లేనిది, తయారీ తేదీ, గడువు ముగియు తేదీ, తయారీదారుని పూర్తి చిరునామా, కస్టమర్ కేర్ నంబర్, ఎం.ఆర్.పి. మొదలగునవి సక్రమంగా ముంద్రించినది లేనిది తనిఖీ చేశారు. షాపులో ఉన్న బస్తాల బరువు బస్తాపై ముద్రించి వున్న బరువుతో సరిపోతుందో లేదో తనిఖీ చేశారు. ఈ సందర్బంగా డా. చదలవాడ హరిబాబు మీడియతో మాట్లాడుతూ అన్నదాతలు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర సివిల్ సప్లయస్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ జిల్లాలలో తనికీలు నిర్వహోంచి నిబంధనలు పాటించని కంపెనీలపై మరియు షాపులపై కేసులు రాయించడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు సత్తెనపల్లి పట్టణంలో తనిఖీలు నిర్వహించామని, త్వరలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలసి అన్ని హోటల్స్ మరియు రెస్టారెంటులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ పల్నాడు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్.అల్లూరయ్య, సత్తెనపల్లి ఇన్స్పెక్టర్ షైక్ సైదా, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటి సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.