నారద వర్తమాన సమాచారం
అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలి: పవన్
ఏపీ: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
కానున్న నేపథ్యంలో డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. బడ్జెట్ సమావేశాల్లో సామాన్యుడి గొంతుగా ఉండాలని అన్నారు. శాసనసభ మర్యాదను కాపాడుతూ హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. మాట్లాడే భాష, పదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పవన్ పేర్కొన్నారు.