నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా
నరసరావుపేట.
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 80 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదుల కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి,నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన రెడ్డి మాసు దిలీప్ కుమార్ OLX వెబ్ సైట్ నందు కెమెరా రోజువారి అద్దెకు ఇస్తానని పెట్టగా, సెప్టెంబర్ నెలలో కండ్రిక గ్రామమునకు చెందిన కసుకుర్తి సాగర్ బాబు అను అతను ఆన్లైన్ లో పరిచయమై మీ కెమెరాను నేను అద్దెకు ఇప్పిస్తాను, నేను సినిమాలకు స్క్రిప్ట్ లు రాస్తాను, నాకు జబర్దస్త్ ప్రోగ్రాం వారు కూడా తెలుసు నేను అందులో పని చేయు చున్నాను అని నమ్మబలికి మనం ఇద్దరం కలిసి యాడ్ ఏజెన్సీ పెడదాము అని నమ్మపలిగించి ఫిర్యాదు వద్ద నుండి 33,00,000/- రూపాయలు ఆన్లైన్ చేయించుకున్నట్లు, అంతట ఫిర్యాదు మోసపోయానని తెలుసుకొని పెద్ద మనుషులను తీసుకొని అతను వద్దకు వెళ్ళగా పెద్ద మనుషుల సమక్షంలో డబ్బులు తీసుకున్నానని నెలకు 50 వేల రూపాయల చొప్పున ఇస్తానని ఒప్పుకొని ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వకుండా తిరిగి ఫిర్యాదు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తున్నందుకు గాను ఎస్పీ ని కలిసే అర్జీ ఇవ్వటం జరిగింది.
ఫ్యామిలీ అపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన బహునాదం శేషమ్మ పెద్ద కుమారుడు అయిన వీరబ్రహ్మం ఫిర్యాదు వద్ద నుండి బంగారం తీసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు, బంగారం (నానుతాడు, తాళిబొట్లు, ఉంగరం, బాసికాలు, పట్టీలు) గురించి అడగగా ఆగి వచ్చి ఫిర్యాదిని ఇబ్బందికి గురి చేస్తున్నందుకు గాను ఎస్పీ ని కలిసి ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట మండలం అల్లూరి వారి పాలెం గ్రామానికి చెందిన బొడ్డపాటి వెంకటేశ్వరరావు నరసరావుపేట లోని ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ నందు నిరుద్యోగ పనిచేస్తున్నట్లు, HDFC బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డు వద్దు అన్న రోజు కాల్ చేస్తున్నట్లు,
ది.21.01.2025 వ తేదీ ఒక అజ్ఞాత వ్యక్తి HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు నుండి కాల్ చేస్తున్నట్లు చెప్పగా ఆ కాల్ కట్ చేసినట్లు, తరువాత ఫిర్యాదు వాట్సాప్ కు ఒక లింక్ పెట్టగా తెలియక ఆ లింక్ నొక్కినట్లు, ఆ తర్వాత ఫిర్యాదు ఫోను ఆ అజ్ఞాత వ్యక్తి కంట్రోల్ లోకి తీసుకొని ఫిర్యాది బ్యాంకు ఆప్ ద్వారా నగదు లావాదేవీలు చేసినందుకు గాను సైబర్ క్రైమ్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగాఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
దాచేపల్లి మండలం ఇరుకపల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి అంజలి వ్యవసాయ పనుల నిమిత్తం జంగిలి నరసింహారావు వద్ద నాలుగు లక్షల రూపాయల పురుగు మందులు అప్పు తీసుకున్నట్లు, అందులో మూడు లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన లక్ష రూపాయలు జంగిలి నరసింహారావు పార్ట్నర్ అయిన జంగిలి వెంకటేశ్వర్లు కు ఇవ్వమనట్లు, అయితే ప్రస్తుతం జంగిలి నరసింహారావు 4 లక్షలకు వడ్డీ కట్టమని ఫిర్యాదు ని వేధిస్తూ మద్యం తాగి వచ్చి అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నందుకు గాను ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
వినుకొండ పట్టణమునకు చెందిన భీముని వెంకట్రావుకు 2019వ సంవత్సరంలో వాంకడావత్ వసంతరావు నాయక్ అను వ్యక్తి ఎంపీడీవో గా పరిచయం అయినట్లు, ప్రస్తుతం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం నందు పనిచేస్తున్నట్లు నమ్మబలికి ఫిర్యాదు మరదలు కుమారుడైన చింత దానయ్య కు ఉద్యోగం ఇప్పిస్తామని దానికి గాను సుమారు 20,00,000/- రూపాయల వరకు ఖర్చు అవుతుందని, ఆ డబ్బులు కనుక తనకు ఇచ్చినట్లయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నందు ఉద్యోగం వస్తుందని, ముందు డబ్బులు ఇస్తేనే నేను ప్రిన్సిపల్ సెక్రెటరీ దగ్గర నుండి కలెక్టర్ దాకా డబ్బులు ఇచ్చుకుంటూ రావాలని ఆ తర్వాత ఉద్యోగం వస్తుందని 20,00,000/- రూపాయలు తీసుకున్నట్లు, ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయిననూ ఉద్యోగం ఇప్పించకుండా మరియు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి డబ్బులు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నందుకుగాను తగిన న్యాయం చేయవలసిందిగా వచ్చి ఎస్పీ కి అర్జీ ఇవ్వటం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కొరకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.