నారద వర్తమాన సమాచారం
ఆరు నెలల తర్వాత ఈరోజు తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు
ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ దేవాలయం ద్వారాలు ఈరోజు ఉదయం తెరుచుకున్నాయి శుక్రవా రం ఉదయం 7 గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య ఈ ఆలయ ద్వారాలు తెరిచా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ, హాజరయ్యారు ఇక ఆలయాన్ని రకరకాల పువ్వులతో అందంగా అలంకరించారు.
జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుడిని దర్శించు కునేందుకు దేశం నలుమూ లల నుంచి ఏటా లక్షలాది మంది దర్శించుకుంటుంటా రు. భారీ మంచు కారణంగా సుదీర్ఘకాలం మూసి ఉండే ఈ పుణ్యక్షేత్రం ఈరోజు తెరుచుకుంది.
ఈ సందర్భంగా భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. తలుపులు తెరచుకోనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు. దీనికోసం 13 టన్నుల పూలను వినియోగించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు విచ్చేసి, కేదారనాథుడికి తొలి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య మంత్రి భక్తులకు శుభాకాం క్షలు తెలియజేశారు. 6 నెలల కిందట ఆలయం తలుపులను మూసివేసే సమయంలో మూల మూర్తికి అలంకరించిన పూజావస్తువులను తొలగించారు. తాజా పూలతో స్వామివారిని అలంకరించారు.
ఆ తరువాత అఖండ జ్యోతిని దర్శనం చేసుకున్నారు. కేదార్‌నాథ్ ఆలయం తలుపు తెరచు కోవడంతో చార్ ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమై నట్టయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు.
యమునోత్రి, గంగోత్రి ధామాలు ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున తెరవగా, బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 4న తెరవనున్నారు. కాగా, కేదార్‌నాథ్ యాత్ర కోసం సోన్‌ప్రయాగ్ నుంచి హెలి కాప్టర్ సేవలు ప్రారంభమ య్యాయి. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమ త్తమయ్యాయి.
ఈ చార్‌ధామ్ యాత్ర కొనసాగే మార్గంలో పోలీ సులు, భద్రతా బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు అధికా రులు చెబుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.