నారద వర్తమాన సమాచారం
ఎల్.హెచ్.ఎమ్ ఎస్ సౌర్యాన్ని ప్రజలుసద్వినియోగం చేసుకోవాలిపల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఐ.పి.ఎస్.
నరసరావుపేట:-
పల్నాడు ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్
పంచాయితీ, మున్సిపల్ ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్ సేవలు అందుబాటులో ఉంటాయన్న జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఐపిఎస్
వేసవి సెలవుల్లో ఎల్.హెచ్.ఎం.ఎస్. యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు ప్రజలను కోరిన జిల్లా ఎస్పీ
జిల్లాలోని పోలీసు స్టేషన్ ల పరిధిలోని పంచాయితీ, మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వేసవి సెలవుల సందర్భంగా తమ స్వంత ప్రాంతాలకు వెళ్ళే సమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఎల్.హెచ్.ఎం.ఎస్. (లాక్డ్ హౌస్
మానిటరింగ్ సిస్టం) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు కోరారు.
దొంగతనాల నియంత్రణకు రాష్ట్ర పోలీసుశాఖ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ( ఎల్.హెచ్.ఎమ్.ఎస్)ను
ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ విధానం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం వలన ఇల్లు విడిచిపెట్టి బయట ప్రాంతాలకు వెళ్ళే సమయాల్లోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి అన్నారు.
ఈ ( ఎల్ హెచ్ ఎమ్ ఎస్) ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్ వినియోగం వలన ప్రజల ఆస్తుల రక్షణకు కవచంలా పని చేస్తుందన్నారు.
పోలీసు స్టేషను పరిధిలోని ప్రజలెవరైనా తాము ఇల్లు విడిచి తమ స్వంత అవసరాలు లేదా పనులు లేదా ఉద్యోగరీత్యా లేదా పండగలకు లేదా ఏదైన ఇతర కారణాల వలన బయట ప్రాంతాలకు వెళ్తున్నట్లుగా సంబంధిత పోలీసు స్టేషనుకు ముందస్తు సమాచారాన్ని అందించినట్లయితే పోలీసులు
ఎల్.హెచ్.ఎమ్.ఎస్. సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తారన్నారు.
ఎల్ హెచ్ ఎం ఎస్ వినియోగించే విధానం
ఇందుకుగాను వారు తమ స్మార్ట్ ఫోనులో గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎల్.హెచ్.ఎం.ఎస్. యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, ఇంటి నుండే తమ పేరు, ఫోను నంబరు,
లొకేషన్ వంటి ఇతర వివరాలను, ఎల్.హెచ్.ఎం.ఎస్.
సేవలను ఎప్పటి నుండి ఎప్పటి వరకు పొందాలన్న విషయాలను యాప్ లో నమోదు చేసి, రిక్వెస్ట్ పంపాలన్నారు.
రిక్వెస్ట్ పంపిన తరువాత వారి మొబైల్ నంబరుకు ఒక రిజిస్ట్రేషను నంబరు వస్తుందని, ఈ నంబరునే యూజర్ ఐడిగా పొందవచ్చునన్నారు.
ఇలా రిక్వెస్ట్ పంపిన తరువాత సంబంధిత పోలీసు స్టేషను నుండి పోలీసులు సదరు ఇంటిని సందర్శించి, సిసి కెమెరా లను ఏర్పాటు చేసి ఆయా ఇండ్ల పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తారన్నారు.
నిఘా కొరకు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతో ఈ యాప్ ను అనుసంధానం చేయడం వలన
దొంగతనాలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు.
ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటి పరిసరాలలోకి ప్రవేశించిన
వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం చేరవేస్తూ, అలారం మ్రోగుతుందన్నారు.
దీనితో పోలీసులు అప్రమత్తమై,
సంబంధిత పోలీసు స్టేషనుకు సమాచారం అందించి, దొంగతనాలు జరగకుండా సులువుగా నియంత్రించడంతో పాటు, నిందితులను కూడా రెడ్ హ్యాండడ్ గా పట్టుకోవచ్చు అన్నారు.
పల్నాడు జిల్లా లోని పోలీసు స్టేషన్ ల పరిధిలోని పంచాయితీ, మున్సిపల్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎల్.హెచ్.ఎం.ఎస్. సేవలను
సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు.
పల్నాడు జిల్లాలో నివసించే ప్రజలు ఎప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా
ఎల్.హెచ్.ఎం.ఎన్. సౌకర్యాన్ని ఉచితంగా వినియోగించుకోవాలని, దొంగతనాల నియంత్రణలో పోలీసులకు
సహకరించాలని ప్రజలను జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








