నారద వర్తమాన సమాచారం
Operation Sindoor: బ్రహ్మోస్ దెబ్బకు.. బెదిరిన పాక్ వాయుసేన స్థావరాలు!
భారత్ శనివారం
తెల్లవారుజామున పాక్ సైనిక స్థావరాలపై చేసిన మెరుపుదాడిలో ఓ అత్యాధునిక ఆయుధం వాడినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెటెస్క్: పాకిస్థాన్
అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలో ఆర్మీ చీఫ్ ఆఫీస్ నుంచే ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున పాక్లోని ఈ కుంభస్థలాన్నే భారత్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఇక్కడ పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. దీంతోపాటు గగనతల రిప్యూలర్ ట్యాంకర్ ఫ్లైట్లు హెవీ లిఫ్టర్లు ఇక్కడ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ముందు రోజు అర్ధరాత్రి పాక్ దుందుడుకు చర్యలకు ప్రతిగా భారత్ తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్ను వాడినట్లు తెలుస్తోంది. వీటితో రఫీక్, మురీద్, చక్లాలా, రహీంయార్ ఖాన్, సుక్కుర్, చునియన్. పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు,
కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలున్నాయి. భారత్ వాడిన వాటిల్లో హ్యామర్ గైడెడ్ బాంబులతోపాటు.. స్కాల్స్ క్షిపణే కాకుండా.. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఉండే అవకాశాలున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెప్రెస్ కథనంలో పేర్కొంది. యుద్ధ రంగంలో దీనిని ఉపయోగించడం ఇదే తొలిసారి కావొచ్చని పేర్కొంది. కాకపోతే.. అధికారిక వర్గాల నుంచి దీనిపై ఎటువంటి ధ్రువీకరణ లేదని పేర్కొంది. భారత్ నిమిషాల వ్యవధిలో పార్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం ఆ దేశంలో గుబులు రేపింది. అయితే.. యూపీలో ఈ క్షిపణి తయారీ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని వెల్లడించారు. ఆ సమయంలో ఈ క్షిపణులకున్న శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. దీని ప్రభావం గురించి తెలియని వారెవరైనా ఉంటే.. పాకిస్థాన్ను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
పంజాబ్ ప్రావిన్స్లోని రఫికీ వైమానిక స్థావరం షోర్కోట్లో ఉంది. అత్యాధునిక విమానాలకు ఇది కేంద్రం . ఇస్లామాబాద్కు 337 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10,000 అడుగుల రన్వే ఇక్కడి ప్రత్యేకత. ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్లు ఉన్నాయి పంజాబ్లోని చక్వాల్లో మురీద్ ఉంది. పాక్ ఆపరేషనల్ ఫ్లయింగ్ బేస్ గా దీనికి పేరుంది.
దీంతోపాటు మానవ రహిత సాయుధ డ్రోన్లు ఇక్కడ ఉన్నాయి.
పాక్ రాజధాని ఇస్లామాబాద్కు అత్యంత సమీపలోని రావల్పిండిలో చక్లాలా వైమానిక స్థావరం ఉంది. పాక్ కీలక జనరల్స్ ఇక్కడే ఉంటారు. ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కార్యాలయం కూడా చక్లాలాలోనే ఉంటుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.