Sunday, July 20, 2025

జగన్ ట్రాప్ లో చంద్ర‌బాబు పడుతున్నారా? జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు.. బాబు జంకుతున్నారా?..

నారద వర్తమాన సమాచారం

జ‌గ‌న్ ట్రాప్‌లో చంద్ర‌బాబు? బిహైండ్ ఆఫ్‌ది డిబేట్

జగన్ ట్రాప్ లో చంద్ర‌బాబు పడుతున్నారా? జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు.. బాబు జంకుతున్నారా?.. చిత్రంగా ఉన్నా రాజకీయ వర్గాల్లో.. అలాగే మీడియా వర్గాల్లో కూడా ఈ ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే సహజంగా చంద్రబాబు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. అభివృద్ధికి ఆయన ప్రాధాన్యం ఇస్తారు. ఇది ఎవరు కాదనలేని వాస్త‌వం. అభివృద్ధిని చూపించి అయినా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే వీటన్నిటికీ భిన్నంగా గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు.

వాటిని అమలు చేసేందుకు రెడీ అయ్యారు. వీటిలో ఇప్పటివరకు తల్లికి వందనం, రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు అందుబాటులోకి తెస్తున్నారు. నిజానికి సంక్షేమ పథకాల విషయంలో ఈ రెండు భారీగా పెట్టుబడులతో కూడిన అంశాలు. అయినప్పటికీ చంద్రబాబు వీటిని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. వేల కోట్ల రూపాయల సొమ్ములతో ఈ పథకాలను అమలు చేయడం, పైగా పదేపదే వాటిని అమలు చేస్తామని చెప్పడం వంటివి రాజకీయంగా చర్చకు దారితీసింది.

ఎందుకంటే అభివృద్ధి ఉన్నప్పుడు సహజంగానే ప్రజలు కూడా సంక్షేమం జోలికి పోరు. కానీ, జగన్ పదేపదే ఒత్తిడి చేస్తుండడం, ఇటు సోషల్ మీడియా, అటు బహిరంగ వేదికపై కూడా ఆయన కూటమి సర్కారును సంక్షేమ పథకాలపై టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడ్డారు.. అనేది టిడిపి కార్యకర్తలు, నాయకుల అంచనా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాల్సి ఉంది. ముఖ్యంగా రాజధాని పూర్తి కావాల్సింది. పోలవరం పూర్తి కావాల్సి ఉంది.

ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ చంద్రబాబు 8,000 కోట్లకు పైగా సొమ్మును తల్లికి వందనం పథకం కింద కేటాయించారు. అన్నదాత సుఖీభవకు దాదాపు ఇంతే మొత్తం కేటాయించే అవకాశం ఉంది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీకి నెలకు 350 కోట్ల రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంది. మరోవైపు పింఛన్లు, ఇంకోవైపు ఇతర పథకాలు కారణంగా ప్రభుత్వంపై ఆర్థికంగా పెనుబారం పడుతుంది.

ఈ క్రమంలో చంద్రబాబు ఏ విధంగా నిర్వహిస్తారు ఎట్లా చేస్తారు అనేది ఆసక్తికర విష‌యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే ఏడాది కాలంలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకున్నామని చెబుతున్నారు. వచ్చిన పెట్టుబడులు 22 వేల కోట్లు. దీనిని బట్టి చంద్రబాబుకు భవిష్యత్తు చాలా కీలకంగా మారిందని పరిశీలకులు చెబుతున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading