నారద వర్తమాన సమాచారం
పెద్దపల్లి జిల్లాలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు అవినీతి అధికారులు
పెద్దపల్లి జిల్లా
అవినీతి అధికారులు ఏమాత్రం మారడం లేదు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారిని లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. పేద ప్రజల నుంచి మొదలు పెడితే బడా కాంట్రాక్టర్ల వరకు ఎవరిని అధికారులు విడిచి పెట్టడం లేదు,ఈ నేపథ్యంలోనే శనివారం మరోసారి అవినీతి అధికారులు ఏసీబీ కి చిక్కారు.
ఇంటి నంబర్ కోసం రూ.10వేలు డిమాండ్ చేసి రూ.ఐదువేల లంచం డిమాండ్ చేసి బాధితుడిని నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు మున్సిపల్ అధికారులను శనివారం మధ్యాహ్నం పట్టుకున్నారు.
ఈ సంఘటన శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబా ద్,మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ కథనం ప్రకారం.. పట్టణం లోని ద్వారక నగర్ కు చెందిన ఆర్నకొండ ప్రసాద్, అనే వ్యక్తి నూతనంగా నిర్మించుకున్న ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ సిబ్బంది ని ఆశ్రయించాడు.
కాగా బాధితుడిని సంవత్సరం పాటు ఆర్‌ఐ వినోద్, బిల్ కలెక్టర్ నాంపల్లి విజయ్‌కుమార్, రూ.10వేల డబ్బులు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఆర్నకొండ ప్రసాద్ చివరకు రూ. 5వేలకు ఒప్పందం చేసుకొని చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దీంతో ఏసీబీ అధికారులు రైడ్ చేసి ఆర్‌ఐ వినోద్, బిల్ కలెక్టర్ నాంపల్లి విజయ్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కార్యక్రంలో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సీఐలు కృష్ణ కుమార్, తిరుపతి, పూర్ణచందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.