నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 96 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
సత్తెనపల్లి మండలం నాగన్నకుంట కు చెందిన షేక్.తాహిరా కు 15 సంవత్సరముల క్రితం వివాహమైనట్లు, ఇప్పటివరకు సంతానం లేకపోవడం వలన ఫిర్యాది భర్త ఆయన షేక్ హుస్సేన్ రోజు త్రాగి వచ్చి వేధిస్తున్నట్లు మరియు చీటికిమాటికి కొడుతున్నట్లు, మీకు దిక్కున చోట చెప్పుకొని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నట్లు, ఇదే అదునుగా చూసుకొని ఫిర్యాది అత్త మరియు ఆడబిడ్డ దురుసుగా ప్రవర్తిస్తున్నందుకు గాను ఫిర్యాది న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామానికి చెందినటువంటి బలుసుపాటి కోటయ్య అను అతను ఆన్లైన్లో పరిచయమైనటువంటి గజ్జల మధుసూదన్ రెడ్డి మరియు రొంగల ప్రవీణ్ కుమార్ అను శ్రీకాకుళం జిల్లా పలాస నివాసులు ఫారెక్స్ వ్యాపారము చేస్తామని నమ్మించి, మీరు పెట్టే పెట్టుబడి పై ప్రతినెలా 10% లాభం ఇస్తామని పెట్టుబడికి ప్రేరేపించినట్లు, అందుకుగాను ఫిర్యాదు రొంగల ప్రవీణ్ కుమార్ కు 45,67,500/- పలు దఫాలు డబ్బులు పంపినట్లు, అయితే రొంగల ప్రవీణ్ కుమార్ లాభం ఇవ్వకుండా కాలయాపన చేస్తుండగా మోసపోయినట్లు గ్రహించి అసలు మొత్తం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను తగిన న్యాయం కొరకు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
సత్తెనపల్లి మండలం బట్లూరు గ్రామానికి చెందిన కట్ట నరేంద్ర అను అతను డిగ్రీ చదివి పొలం పనులు చేసుకుంటున్నట్లు, సత్తెనపల్లి పట్టణం స్టేషన్ రోడ్డు నందు ఆధార్ సెంటర్, మీసేవ సెంటర్ నడుపుతున్న జోగిపర్తి అశోక్, జోగిపర్తి వెంకటేష్ అను సోదరులు పరిచయం అయ్యి ఫిర్యాదిని డిగ్రీ చదివి ఖాళీగా ఉండటం ఎందుకు నీకు ఆధార్ సెంటర్ ఇప్పిస్తాము అని నమ్మించి ఫిర్యాది వద్ద నుండి 90,000/- డిపాజిట్ అమౌంట్ కట్టించుకుని మోసం చేసినట్లు, రెండు మూడు సార్లు వారి వద్దకు వెళ్లి డబ్బులు అడగగా నీకు చేతనైంది చేసుకో అని బెదిరించినందుకు గాను ఈ రోజు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన కోకో హనుమంతరావు డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ఫిర్యాది మేనమామ కొడుకు అయిన తాటికొండ మల్లికార్జున రావు ను ఏమైనా ఉద్యోగం ఉంటే చూడమని అడగగా, అతను తనకు తెలిసిన స్నేహితుడు మోకిరి అఖిల్ స్వరూప్ విజయవాడ నందు మాట్రి్స్ అబ్రాడ్ కన్సిల్టేన్సీ నడుపుతున్నాడని చెప్పగా ఫిర్యాది మరియు అతని స్నేహితుడైన ప్రసాదం తేజ రామకృష్ణ వారి ఇరువురి తండ్రులు మరియు ఫిర్యాది బావ అయిన తాటికొండ మల్లికార్జునరావు వెళ్లి విజయవాడ ఆఫీస్ లో మోకిరి అఖిల్ స్వరూప్ ను కలవగా ఆస్ట్రేలియాలో వర్క్ పర్మిట్ వీసా ఇప్పిస్తాను అందుకుగాను ఒక్కొక్కరికి 18,50,000 ఖర్చు అవుతుందని చెప్పగా ఫిర్యాది మరియు అతని స్నేహితుడు అయిన ప్రసాదం తేజ రామకృష్ణ అంగీకరించినట్టు, ముందుగా ఒక్కొక్కరు 10,00,000/- లు చెల్లిస్తే పని మొదలు పెడతాను అని చెప్పగా ది.22/09/2024 వ తేదీన ముకిరి అఖిల్ స్వరూప్ కు చెల్లించినట్లు, ది.23/11/2024వ తేదీన వర్క్ పర్మిట్ వస్తుందని మిగిలిన డబ్బులు చెల్లించాల్సిందిగా తెలుపగా అదే రోజు 7,50,000/- రూపాయలు చెల్లించినట్లు, తరువాత కొన్ని రోజులకు ఫిర్యాదు మరియు అతని స్నేహితుడు వర్క్ పర్మిట్ వీసా అడుగుతుండగా కొన్ని రోజులకు PRIMI PAC అను కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చిందని ఫిర్యాది ఫోన్ కు వాట్సప్ పంపినట్లు, అంతట అది ఫేక్ లెటర్ అని తెలిసి ఆఫీసుకు వెళ్లి సంప్రదించగా కట్టినటువంటి 18,50,000/- రూపాయలు చెల్లిస్తానని గడువు పెట్టి కొన్ని నెలల తర్వాత చివరగా ది.01/07/2025 వ తేదీన డబ్బులు ఇస్తాడు అని ఆఫీసు వద్దకు వెళ్ళగా ఆఫీసు తీసివేసినట్లు తెలిసి మోసపోయినందుకు గాను ముకిరి అఖిల్ స్వరూప్ పై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
సత్తెనపల్లి పట్టణమునకు చెందిన ఎండి అనీఫ్ రహమాన్ ది.07/05/2024 వ తేదీన నరసరావుపేటకు చెందిన హెచ్.డి.బి ఫైనాన్స్ నరసరావుపేట బ్రాంచ్ నందు ఫిర్యాదు తన స్థలమును తాకట్టుపెట్టి 5,00,000/- రూపాయలు సెక్యూర్డ్ పర్సనల్ లోన్ తీసుకున్నట్లు, తీసుకున్నప్పటినుండి ప్రతి నెల 13,247/-
ఇ.యం.ఐ చెల్లిస్తున్నట్లు, ఫిర్యాదు యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండక లోను క్లోజ్ చేసుకొనుటకు సెటిల్మెంట్ కొరకు హెచ్.డి.బి ఫైనాన్స్ వారిని కోరగా వారు 3,70,000/- రూపాయలు చెల్లించినట్లయితే లోన్ క్లోజ్ చేసి ఫిర్యాదు తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ తిరిగి ఇస్తామని చెప్పినారు.
అంతట ఫిర్యాదు ది.26.06.2025వ తేదీన ఆర్.టి.జి.ఎస్ ద్వారా హెచ్.డి.బి ఫైనాన్స్ వారికి డబ్బు చెల్లించినట్లు, తదుపరి ఫైనాన్స్ వారు ఫిర్యాదుకు ఫోన్ చేసి లోన్ క్లోజ్ అయినది మీ డాక్యుమెంట్లు పది రోజులలో వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్పినట్లు, తదుపరి హెచ్.డి.బి ఫైనాన్స్ కలెక్షన్ మేనేజర్ ఫిర్యాదుకు ఫోన్ చేసి మరలా మీరు 20,000/- చెల్లించితేనే మీ డాక్యుమెంట్స్ తిరిగి ఇస్తాము లేకపోతే ఇవ్వము అని, మీకు చేతనేంది మీరు చేసుకోండి అని దౌర్జన్యంగా మాట్లాడినట్లు కావున హెచ్.డి.బి బ్యాంకు మేనేజర్ గౌస్ మరియు కలెక్షన్ మేనేజర్ రవికిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని డాక్యుమెంట్లు ఇప్పించవలసిందిగా ఎస్పీ ని కలిసి ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు.
అదే విధంగా దూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల కొరకు భోజన ఏర్పాట్లు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








