నారద వర్తమాన సమాచారం
మందు తాగించి.. 8వ తరగతి బాలికపై ముగ్గురి అత్యాచారం..నిందితుల్లో ఇద్దరు మైనర్లు…
హైదరాబాద్ శివారు నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి బాలికకు ఒక పాత నేరస్థుడు, ఇద్దరు బాలురు మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఈ వివరాలు వెల్లడించారు.పుప్పాలగూడకు చెందిన బాలిక(15) 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 7న చార్మినార్ వద్ద షాపింగ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసే బాలుడు(16) పరిచయం చేసుకొని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తరువాత రోజూ ఫోన్ చేసి మాట్లాడుతూ మళ్లీ కలుద్దామని కోరాడు. ఈ నెల 16న స్కూల్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన బాలిక చార్మినార్ వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాలిక తల్లి నార్సింగి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో వివిధ ప్రాంతాల్లో వెతికారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో చెంగిచెర్లలో బాలిక ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థిని తన దగ్గరకు రావడాన్ని అవకాశంగా తీసుకున్న బాలుడు తన స్నేహితులైన పాతబస్తీ రెయిన్‌బజార్‌కు చెందిన ఆటోడ్రైవరు ఇమ్రాన్‌ఖాన్ అలియాస్ షిషి(24), తలాబ్‌కట్టకు చెందిన బాలుడిని పిలిపించాడు. బాలికను చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తిప్పి అర్ధరాత్రి తర్వాత నగర శివారు చెంగిచెర్లలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయం దగ్గరికి తీసుకెళ్లారు. ముగ్గురూ మద్యం తాగి, బాలికతోనూ బలవంతంగా తాగించారు. మత్తులో ఉండగా కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.ఘటనా స్థలంలో బాలికతోపాటు ఉన్న ఓ బాలుడు, ఇమ్రాన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
8 కేసుల్లో నిందితుడు
ఇమ్రాన్‌ఖాన్ దోపిడీ, దొంగతనం, భౌతికదాడులు సహా ఎనిమిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరో బాలుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








