నారద వర్తమాన సమాచారం
ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఐపీఎస్.,
రంజాన్ పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియ చేశారు.
ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం అంతా నియమనిష్ఠలతో, కఠోరమైన ఉపవాసాలతో,దైవ ప్రార్థనలతో గడపి, పేద వారికి సాయం చేస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు.
త్యాగం, సేవానిరతి, పవిత్రతలకు ప్రతీకైన రంజాన్ పర్వదినం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకోవాలని సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
దైవ చింతన, భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ముస్లిం సోదరులు అల్లాహ్ ను కొలవడం ఆదర్శప్రాయమని తెలిపారు.
అల్లాహ్ కృపతో ఈ రంజాన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని తెలిపారు.
రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ఈద్గా ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదులకు రానున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులు నిర్వహించాలని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









