నారద వర్తమాన సమాచారం
చారిత్రాత్మక కొండవీడు లో నైట్ క్యాంపింగ్…..
యడ్లపాడు మండలంలోని చారిత్రాత్మక కొండవీడు కోటపై ఏప్రిల్ 11 నుండి నైట్ టెంట్స్ క్యాంపైన్ ప్రారంభం కానుంది. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ‘కొండవీడు అడ్వెంచర్స్’ ఈ వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది.ఈ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు సాయంత్రం 5 గంటలకు కోటకు చేరుకుని, రాత్రి టెంట్లలో బస చేయవచ్చు. మ్యూజికల్ నైట్, క్యాంప్‌ఫైర్, సంప్రదాయ విందుతో పాటు మరుసటి రోజు ఉదయం సూర్యోదయ వీక్షణ, ట్రెక్కింగ్, బోటింగ్ మరియు కయాకింగ్ వంటి సాహస క్రీడలను ఆస్వాదించవచ్చు. ప్యాకేజీ ధర పెద్దలకు ₹2000, పిల్లలకు 8 ఏళ్ల లోపు ₹1000 గా నిర్ణయించారు. ఇందులో స్నాక్స్, డిన్నర్ మరియు బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యాలు కూడా కలిపి ఉంటాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








