నారద వర్తమాన సమాచారం
మాచర్లలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు… గురజాల అప్పారావు
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ మాచర్ల పట్టణంలోని అంబేద్కర్ పార్కు నందు ఆయనకు ఘన నివాళులర్పిస్తూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ ప్రోడక్ట్ వెల్ఫేర్ ఎవర్నెస్ ఆర్గానేషన్ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు మాట్లాడుతూ భారతదేశానికి పెద్ద రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులర్పిస్తూ ఏప్రిల్ 14న, 1891న మహారాష్ట్రలోని మహో గ్రామం లో జన్మించాడు. చిన్నతనం నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొని, గొప్ప పట్టుదలతో చదివేవాడు. రాజ్యాంగ శిల్పి భారత ప్రజాస్వామ్యానికి పునాది వేశాడు. భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త, భారతదేశ మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి, అంటరానితనం, కుల వివక్షతను రూపుమాపేందుకు ఎంతో కృషి చేశాడు, దళితులు, మహిళలు మరియు కార్మికుల హక్కుల కోసం ఎంతో కృషి చేశాడు. బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో. లండన్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని పొందాడు. భారతదేశ స్వాతంత్రం కోసం, పత్రిక ప్రచురణ కోసం, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారత రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రలో చిరస్వనియంగా నిలిచిన నాయకుడు సమసమాజ స్థాపన కోసం, భారతదేశ ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగ నిర్మాణంలో పొందుపరిచిన సమాన హక్కులు ప్రజల యొక్క అభ్యున్నతికి దిక్సూచిగా రాజ్యాంగం నిర్మించినాడు అని అన్నారు. దళిత బహుజన బీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు పేరు పోగు జార్జి మాట్లాడుతూ రాజ్యాంగంలో ఆర్టికల్ 340 బీసీలకు ఆర్టికల్ 341 ఎస్టీలకు ఆర్టికల్ 342 ఎస్సీలకు అభ్యుదయ వాదిగా పొందు పరిచాడన్నారు దళిత సీనియర్ నాయకులు పొన్నాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు రిజర్వేషన్లు, హక్కులు, సమానత్వం, కోసం అణగారిన వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొలేద్దుల యేసు పదం. నాదేండ్ల దశరదు.కుక్క మూడి ప్రసాదు. తదితరులు పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








