నారద వర్తమాన సమాచారం
పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు భారీ షాక్ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
ఏపీలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయింది. ఇక నుంచి ఉద్దేశపూర్వకంగా పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే పెట్రోల్ బంక్ నిర్వాహకులకు భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతుంది. పద్ధతి మార్చుకోకపోతే పెట్రోల్ బంక్ ను సీజ్ చేసేందుకు వెనకాడబోమని ప్రభుత్వం వార్నింగ్ ఇస్తుంది. యుద్ధం బూచిగా చూపిస్తూ పెట్రోల్, డీజిల్ కొరతను పెట్రోల్ బంకుల నిర్వహకులు సృష్టిస్తున్నారు. పెట్రోల్ , డీజిల్ ను బ్లాక్ మార్కెట్లో విక్రయించుకొని సొమ్ము చేసుకునేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. దీంతో ధరలు కూడా పెరుగుతాయని వార్తలు షికారు చేయడంతో పెట్రోల్ బంకుల యాజమాన్యాలు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటన్నిటికీ ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమవుతుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








