నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల మండలం, గుత్తికొండ గ్రామంలో జరిగిన దేవాలయాల పునః ప్రతిష్ట మహోత్సవంలో…ఎమ్ పి కృష్ణదేవరాయలు…
శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ లోకేశ్వర స్వామి దేవస్థాన పునః ప్రతిష్ట, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ట, అలాగే సాయినాథ మందిరం మరియు పోలేరమ్మ దేవాలయ పునః ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడి ఆశీస్సులు అందుకోవడం సంతోషంగా ఉంది. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, దేవాలయాల పునరుద్ధరణలో పాలుపంచుకుంటున్న గ్రామస్తులకు, కమిటీ సభ్యులకు అభినందనలు. ఆ భగవంతుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








