నారద వర్తమాన సమాచారం
జిల్లాలో ఇండ్ల గణ న నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా…..
జిల్లాలో ఇండ్లగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ హెచ్చరించారు. జిల్లాలో ఇండ్లగణన ప్రగతిపై అధికారులతో సోమవారం జిల్లా ఇంచార్జి కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 1వ తేదీ నుండి 30వ తేదీ లోగా ఇండ్లగణనను ఎన్యూమరేటర్లు ఎట్టిపరిస్థితులలోనూ పూర్తిచేయాలన్నారు. ఇండ్లగణన ప్రారంభించి 10 రోజులు అయినప్పటికీ ఇంతవరకు నిర్దేశించిన స్థాయిలో ప్రగతి లేకపోవడంపై ఇంచార్జి కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని, ఈ విధులలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఎన్యూమరేటర్లకు తమకు రోజూవారీ నిర్దేశించిన మేర లక్ష్యాలను తప్పనిసరిగా సాధించి, మే, 30వ తేదీలోగా గణన కార్యాక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రెండురోజుల్లోగా నిర్దేశించిన స్థాయిలో ప్రగతి కనపరచని సిబ్బంది శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








