నారద వర్తమాన సమాచారం
పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరద్
పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉండి, గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న బండి భగీరథ్ శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణకు హాజరుకాకుండా గైర్హాజరవడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి, ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఆయన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.
ఇదే కేసులో అంతకుముందు శనివారం ఉదయం బాధితురాలు, ఆమె తల్లి మేడ్చల్ కోర్టుకు హాజరై మెజిస్ట్రేట్ ఎదుట తమ స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు. మద్యం సేవించమని ఒత్తిడి చేసి, బలహీన స్థితిలో అనుచితంగా ప్రవర్తించాడని తల్లి కోర్టు ముందు ఆరోపించారు. ఈ వ్యవహారంలో సిట్ (SIT) దర్యాప్తు కొనసాగుతుండగా, వాట్సాప్ చాటింగ్లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆధారాలను సేకరించిన పోలీసులు.. ప్రస్తుతం లొంగిపోయిన భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








