నారద వర్తమాన సమాచారం
మే 26నే కేరళకు రుతుపవనాలు !!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భానుడి భగభగలకు, తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి)చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే దేశాన్ని పలకరించనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
మే 26వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1వ తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి అంతకంటే ముందే, అంటే మే 26నే ఇవి రానున్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ అంచనాకు నాలుగు రోజులు ముందు లేదా వెనుక (మే 22 నుంచి మే 30 మధ్య) రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేరళలో ప్రవేశించిన అనంతరం ఇవి క్రమంగా ఉత్తరం వైపుగా కదులుతూ దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. దీంతో దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల (వర్షాకాలం) సీజన్ ప్రారంభమౌతుంది. గతేడాది మే 24న రుతుపవనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








