నారద వర్తమాన సమాచారం
పల్నాడును డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలి: కలెక్టర్ కృతికా శుక్లా
పాఠశాలలు, కళాశాలల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశం
పల్నాడు జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
యువత డ్రగ్స్ బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతి శనివారం విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
డ్రగ్స్ విక్రయాలు, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై సమాచారం అందించేందుకు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.
గత మూడు నెలల్లో 23 మందిని అరెస్ట్ చేసి, 15.137 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
డ్రగ్స్‌కు బానిసైన వారికి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా మెరుగైన చికిత్స అందించాలని, పోలీస్, విద్య, వైద్య, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








