నారద వర్తమాన సమాచారం
చిలకలూరిపేట – నకరికల్లు నాలుగు లైన్ల విస్తరణ పనుల భూమి పూజ చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
చిలకలూరిపేట–నకరికల్లు జాతీయ రహదారి NH-167Aను రూ. 787.38 కోట్ల అంచనా వ్యయంతో 38.08 కి.మీ మేర 4-లేన్లుగా విస్తరించే పనులకు శుక్రవారం కేసానపల్లిలో భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు, స్థానిక ప్రజలతో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ రహదారి హైదరాబాద్–చీరాల కనెక్టివిటీకి ఎంతో కీలకమని తెలిపారు.
భూసేకరణకు కేటాయించిన రూ.240 కోట్లలో ఇప్పటికే సుమారు రూ.120 కోట్లు రైతుల ఖాతాల్లో జమ.
మిగిలిన పరిహారం కూడా అవార్డు స్వీకరించిన అనంతరం చెల్లింపు.
చట్టప్రకారం రైతులకు ఆర్బిట్రేషన్‌కు వెళ్లే అవకాశం.
4-లేన్ రహదారితో ప్రమాదాలు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సులభతరం.
రైతులు తమ పంటలను గుంటూరు మిర్చి యార్డ్‌తో పాటు ఇతర మార్కెట్లకు వేగంగా తరలించేందుకు మరింత సులభతరం కానుంది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








