నారద వర్తమాన సమాచారం
చెన్నాయపాలెం ఎం పీ పీ ఎస్ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా కాటేపల్లి రవికుమార్
మాచవరం మండలం, చెన్నాయపాలెం: చెన్నాయపాలెం ఎం పీ పీ ఎస్ హైస్కూల్లో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎస్ఎంసీ నూతన చైర్మన్గా కాటేపల్లి రవికుమార్, వైస్ చైర్మన్గా సపవత్ రేణుక బాయి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు, గ్రామ సర్పంచ్ బొగ్గవరపు అంజయ్య అభినందనలు తెలిపారు.
పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఎస్ఎంసీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. నూతన చైర్మన్ కాటేపల్లి రవికుమార్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








