నారద వర్తమాన సమాచారం
రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ… ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు గ్రామంలో సమగ్ర భూ రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, రైతులకు అత్యాధునిక భద్రతా ప్రమాణాలు మరియు అధికారిక రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు స్వయంగా రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ.. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన ఈ నూతన పాస్ పుస్తకాల వల్ల రైతులకు ఎంతో భద్రత చేకూరుతుందని, భవిష్యత్తులో భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వెంకటేశ్వరరావు తెలుగుదేశం,జనసేన,బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








