నారద వర్తమాన సమాచారం
ఎన్నికల కమిషన్ సూచనల మేరకే మీ విధులు నిర్వర్తించాలి..జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల
ఎన్నికల కమిషన్ సూచనల మేరకే మీ విధులు నిర్వర్తించాలి
ఆర్వోలు, ఏఆర్ఓ లు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నందుసమగ్ర అవగాహన కల్గి ఉండాలి
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల
ఆర్వోలు, ఏఆర్ఓ లు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నందుసమగ్ర అవగాహన కల్గి ఉండాలి అని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల పేర్కొన్నారు, బుధవారం ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్ఓ, ఏఆర్ఓలకు మాస్టర్ ట్రైనర్లతో ఎన్నికల సరళి, నిర్వహణ, నిబందనలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది అందరు సిద్దంగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఆర్.ఓ ల పాత్ర ఎంతో ముఖ్యమని, రిటర్నింగ్ అధికారి హోదాలో విధులు నిర్వహిస్తున్నవార్డులో పూర్తి బాధ్యవహించాల్సి వస్తుందని,కావున ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారుల బృందం అంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ కోసం అంతా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు. సందేహాలు ఉంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని, సొంత నిర్ణయాలు వద్దన్నారు. నామినేషన్ ప్రక్రియలో ఒత్తిడిలు వచ్చినా నిబంధనలను ప్రకారం నడుచుకోవాలన్నారు. నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టాలని, నామినేషన్లు తిరస్కరణకు సంబంధించి స్పష్టమైన కారణాలను నమోదు చేయాలన్నారు. తిరస్కరించిన నామినేషన్లపై ఒక కమిటీ విచారణ చేస్తుందన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలన్నారు. ఆర్ఓ, ఏఆర్ఓ విధులుగా విధులు కేటాయించబడిన వారు ముందుగా మీకు కేటాయించబడిన డివిజన్లలో ఓటర్ల నమోదు (ఎలేక్ట్రోరోల్), ఓటర్ల ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపు మరియు పోలింగ్ స్టేషన్లను పరిశీలించి. అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆర్ఓ, ఏఆర్ఓలు ఎలేక్ట్రోరోల్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధులు కేటాయించబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆర్ఓ హ్యాండ్ బుక్, ఎలక్షన్ గైడ్ లైన్స్, కాండిడేట్స్ హ్యాండ్ బుక్ వంటి వాటి పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో , జేసీ సంజన సింహ , ఇతర అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








